మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్‌.. కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపులు

10 Feb, 2023 17:20 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశాయి. ఆ తొలగింపులు ఎంత దూరం, ఎంత మేరకు ఉద్యోగులపై ప్రభావం చూపుతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ఏడాది జనవరిలో మైక్రో సాఫ్ట్‌ 10 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న ప్రకటించింది. తాజాగా ఆ ప్రకటనకు అనుగుణంగా లే ఆఫ్స్‌ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

బ్లూమ్‌ బెర్గ్‌ నివేదిక ప్రకారం.. అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌ రెడ్‌ మాండ్‌ క్యాంపస్‌కు చెందిన హోలోలెన్స్‌, సర్ఫేస్‌,ఎక్స్‌ బాస్‌ డివిజన్‌లలో విధులు నిర్వహిస్తున్న 617 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే తమకు టెర్మినేషన్‌ లెటర్లు అందినట్లు లేఆఫ్స్‌ ఉద్యోగులు లింక్డిఇన్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. 

ప్రశ్నార్ధకంగా హోలోలెన్స్‌ ఉద్యోగులు భవిష్యత్‌
హోలో లెన్స్‌ అంతటా ఉద్యోగుల తొలగింపులు 3వ తరం హోలో లెన్స్‌ మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని నివేదిక హైలైట్ చేస్తుంది. జనవరిలో యూఎస్‌ ప్రభుత్వం 400 మిలియన్ల ఖరీదైన 6,900 హోలోలెన్స్‌ గాగుల్స్‌ను కొనుగోలు చేయాలంటూ ఆర్మీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ తరుణంలో సంస్థ తొలగింపులతో ఆయా విభాగాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు