ఎల్‌జీ సంచలన నిర్ణయం : యూజర్లకు షాక్‌

5 Apr, 2021 09:58 IST|Sakshi

మొబైల్ ఉత్పత్తి,‌  బిజినెస్‌కు గుడ్‌బై: ఎల్‌జీ

తీవ్రమైన పోటీ,  భారీ నష్టాలు

సాక్షి,న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్  దిగ్గజం ఎల్‌జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా  స్మార్ట్‌ఫోన్‌ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు తెలిపింది. దాదాపు అరేళ్లుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్‌జీ తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు బడా కంపెనీలకు విక్రయించాలన్న ప్లాన్లు  విఫలం కావడంతో ఈ  దిశగా  కంపెనీ అడుగులు వేసింది. తద్వారా  మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎల్‌జీ నిలిచింది.

ఎల్‌జీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. 2013లో  ఆపిల్‌, శాంసంగ్‌ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తరువాత  తీవ్రపోటీకి తోడు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే కంపెనీకి మార్కెటింగ్  నైపుణ్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.  (ఈ స్మార్ట్‌ఫోన్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌)

కాగా గత ఆరేళ్లలో ఎల్‌జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (రూ.32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్నుంచి వైదొలగాలని కంపెనీ   నిర్ణయించుకుంది. నష్టాల నుంచి గట్టేందుకు అన్నిరకాల అవకాశాలను పరిశీలిస్తున్నామంటూఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించినప్పటికీ, మొబైల్‌ బిజినెస్‌కు గుడ్‌బై చెప్ప నుందంటూ ఇటీవల పలు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు