కరోనా పోరులో భారత్​కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్

12 May, 2021 19:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మన దేశంలో గత 24 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో సహాయం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషికి మద్దతుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశం అంతటా 10 తాత్కాలిక ఆసుపత్రులకు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. స్థానిక ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇది జరుగుతుంది. ఈ అసోసియేషన్‌లో భాగంగా, ఈ కీలకమైన కాలంలో వైద్య మౌలిక సదుపాయాల కొరకు ఎల్జీ 5.5 మిలియన్ డాలర్ల(రూ.40 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.  

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలోకి ఈ రోజుకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కోవిడ్ -19 వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరులు, ప్రభుత్వాలకు మద్దతుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ & ఎన్జిఓ భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. దేశంలో అతిపెద్ద వైద్య సదుపాయం గల ఎయిమ్స్ లో కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి మరిన్ని పడకలు, అవసరమైన మౌలిక సదుపాయాలకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నిధులు సమకూరుస్తుంది.  ఈ మేక్‌షిఫ్ట్(తాత్కాలిక) ఆస్పత్రులన్నీ ఢిల్లీ, బెంగళూరు, పూణే, భోపాల్, ఉదయపూర్, లక్నో వంటి ఇతర నగరాల్లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వివిధ రాష్ట్రాలలో పీపుల్ టు పీపుల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయనుంది.
 
సంస్థ తీసుకుంటున్న చొరవ గురుంచి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎమ్ డీ యంగ్ లక్ కిమ్ మాట్లాడుతూ.. “కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి, పౌరులకు మా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము. గత ఏడాది మహమ్మారి ప్రారంభంలో, మేము మా వనరులను ఆరోగ్య సంరక్షణ కోసం పంచుకున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రాణాలను కాపాడిన వారిమీ అవుతాము అని నమ్ముతున్నాము. వైద్య మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము వివిధ ప్రభుత్వ/ భాగస్వాములతో పనిచేస్తున్నాము. దీని కోసం 5.5 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్ల) ఆర్థిక సహాయన్ని ప్రకటించినట్లు” పేర్కొన్నారు.
 
2020 ఏప్రిల్ లో ఎల్జీ అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిసి భారతదేశం అంతటా 1 మిలియన్ బోజనాలను అందించినట్లు పేర్కొన్నారు. ఎల్జీ ఇండియా వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ & టీవి వంటి ఉత్పత్తులను రాష్ట్ర, జిల్లాల్లో నిర్బంధ / ఐసోలేషన్ వార్డులకు కేటాయించిన 300+ ఆసుపత్రులకు విరాళంగా ఇచ్చింది. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలుపుతున్న మద్దతును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసించాయి. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రతిజ్ఞ చేసింది. 

చదవండి:

టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్!

మరిన్ని వార్తలు