12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం

19 Oct, 2020 14:33 IST|Sakshi

దసరా పండుగ సీజన్‌  మరోసారి ఎలక్ట్రానిక్ గూడ్స్‌కు ఎంత డిమాండ్‌ ఉందో నిరూపించింది. అందులోనూ కొత్తరకం ఫోన్స్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదని మరోసారి నిరూపితమయ్యింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్‌లో కొత్తగా లాంచ్‌ చేసిన ఎల్‌జీ జీ8ఎక్స్‌ డ్యుయల్‌ స్క్రీన్ రికార్డు సృష్టించింది. ఏకంగా 12 గంటల్లోనే 350 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది. 1.75 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ సందర్భంగా ఎల్‌ జీ ఫోన్‌ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హెడ్‌ అద్వైత వైద్య మాట్లాడుతూ, లాక్‌డౌన్‌లో చాలా మంది ఇంట్లో నుంచి పని చేయాల్సి వచ్చిందని అప్పుడు వాళ్లు మల్టీ టాస్క్‌ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

వారు ఒకేసారి ఆఫీస్‌ పని చేస్తూ వేరే యాప్స్‌ కూడా చూడాల్సి వచ్చిందని దానిలో నుంచే ఈ డ్యుయల్‌ స్క్రీన్ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ఫోన్‌లో ఒక స్క్రీన్‌లో మీకు కావాల్సిన పని చూసుకుంటూనే మరో స్క్రీన్‌లో మీకు కావాల్సినవి తెరవొచ్చని పేర్కొన్నారు. చూడటానికి చాలా బాగుండటంతో చాలా మంది ఈ ఫోన్‌ వైపు మొగ్గు చూపారని వెల్లడించారు. కస్టమర్‌ డిమాండ్స్‌కు అనుగుణంగా ఇంకొన్ని ఫోన్లను అందుబాటులోకి తీసురానున్నామని పేర్కొన్నారు. ఇక అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా లాంటి ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలు దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వేదికలపై భారీగా అమ్మకాలు 

>
మరిన్ని వార్తలు