ఎల్‌జీ నుంచి ఎల్‌ఈడీల కొత్త శ్రేణి

27 May, 2022 01:36 IST|Sakshi

న్యూఢిల్లీ: కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా 2022 ఓఎల్‌ఈడీ టీవీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిలో 106 సెం.మీ. (42 అంగుళాలు) నుంచి 246 సెం.మీ. (97 అంగుళాల) వరకూ విస్తృత స్థాయిలో మోడల్స్‌ ఉన్నాయని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ హక్‌ హ్యున్‌ కిమ్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద (223 సెం.మీ.) 8కే ఓఎల్‌ఈడీ టీవీ, మార్కెట్లోనే తొలి రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ వీటిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

వీటి ధర శ్రేణి రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ రేటు రూ. 75,00,000 స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త ఓఎల్‌ఈడీ టీవీల్లో గేమింగ్‌ ఔత్సాహికుల కోసం గేమ్‌ ఆప్టిమైజర్‌ మెనూ, నాణ్యమైన పిక్చర్, డాల్బీ విజన్, అప్‌గ్రేడ్‌ చేసిన యూఎక్స్, అల్ఫా9 జెన్‌ 5 ఇంటెలిజెంట్‌ ప్రాసెసర్‌ మొదలైన ఫీచర్లు ఉంటాయని కిమ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు