సరికొత్త డిజైన్‌తో ఎల్‌జీ 'వెల్వెట్‌' లాంచ్

28 Oct, 2020 14:00 IST|Sakshi

 సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ, సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం ఎల్‌జీ   కొత్త స్మార్ట్ ఫోను లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్‌, డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీతో ఎల్‌జీ వెల్వెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో  విడుదల చేసింది. స్టీరియో స్పీకర్లు, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఇతర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో  ప్రధాన ఆకర్షణ.


 

ధర లభ్యత
ఎల్‌జీ వెల్వెట్  ప్రారంభం ధర 36,990  రూపాయలు. అయితే డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీ మోడల్ ధర 49,990  రూపాయలు. ఇది అక్టోబర్ 30 నుండి అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లలో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ అరోరా సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఎల్‌జీ వెల్వెట్ ఫీచర్లు
6.8 అంగుళాల స్క్రీన్‌ 
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 10 విత్ ఎల్‌జీ  యుఎక్స్ 9
2340 x 1080  పిక్సెల్స్ రిజల్యూషన్
6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌ 
2 టీబీదాకా విస్తరించుకునే అవకాశం
48+8+5 ఎంపీ ట్రిపుల్ రియర్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా 
4300ఎంఏహెచ్  బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు