కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!

2 Jul, 2021 20:48 IST|Sakshi

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జూలై 2న ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ కింద గృహ రుణ వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారు ఆగస్టు 31, 2021 లోపు రుణాలు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఎల్ఐసీ తెలిపింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే, రుణగ్రహీతల సీబీల్ స్కోర్ కచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటామని పేర్కొంది.

సీబీల్ స్కోర్ మంచిగా ఉన్న వారికి 6.66 శాతం నుంచి వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గరిష్టంగా 30 సంవత్సరాల గడువు వరకు గృహ రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రుణగ్రహీతలు గృహ రుణాల కోసం ఆఫీస్ కూడా రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కి చెందిన HomY app ద్వారా ఆన్​లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొంది. అలాగే, ఆన్​లైన్ ద్వారానే రుణ దరఖాస్తులను ట్రాక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ HomY app ద్వారా తమ వినియోగదారులకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుందని తెలిపింది. మిగతా వివరాల కోసం ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(https://www.lichousing.com) పోర్టల్ సందర్శించవచ్చు.

చదవండి: డీఆర్‌డీఓ డీ-4 డ్రోన్‌ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు