తగ్గిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం

8 Feb, 2023 19:58 IST|Sakshi

ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పడిపోయి రూ.480 కోట్లకు వచ్చి చేరింది. ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఉన్నప్పటికీ ఆశించిన క్రెడిట్‌ నష్టానికి అదనపు కేటాయింపులు చేయడం ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ ప్రకటించింది.

రాని బాకీల కోసం చేసిన అదనపు కేటాయింపులు డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.7,285 కోట్లుగా ఉన్నాయి. 2021 అక్టోబర్‌–డిసెంబర్‌లో ఇది రూ.5,716 కోట్లు. స్థూల నిరర్ధక ఆస్తులు 5.04 నుంచి 4.75 శాతానికి వచ్చి చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు 3.2 నుంచి 2.4 శాతంగా ఉన్నాయి.

ఆదాయం 16 శాతం దూసుకెళ్లి రూ.5,871 కోట్లు, నికర వడ్డీ ఆదాయం 10 శాతం ఎగసి రూ.1,606 కోట్లుగా ఉంది. జారీ చేసిన రుణాలు రూ.17,770 కోట్ల నుంచి రూ.16,100 కోట్లకు వచ్చి చేరాయి.   
 

మరిన్ని వార్తలు