ఎల్ఐసీ గ్రిహా వరిష్ట లోన్ తీసుకున్నవారికి శుభవార్త!

26 Mar, 2021 18:56 IST|Sakshi

మీరు ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ గ్రిహా వరిష్ట కింద హోమ్ లోన్ లేదా ప్లేట్ కోసం లోన్ తీసుకున్నారా అయితే మీకు శుభవార్త. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్ధ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గ్రిహా వరిష్ట కింద లోన్ తీసుకున్న వారికీ ఆరు ఈఎంఐలు మాఫీని(వేవర్) ప్రకటించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ అఫర్ ప్రకటించింది.  

ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ అఫర్ వర్తిస్తుంది. బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలలో 37వ, 38వ, 73వ, 74వ, 121వ, 122వ ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. పేన్షనర్ల కోసం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గృహ వరిష్ట పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఉద్యోగ పదవి విరమణ పొందిన వారు/ భవిష్యత్ లో ఖచ్చితమైన పెన్షన్ సదుపాయాన్ని కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం. కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి రుణ వడ్డీ రేటును తగ్గించింది. 700 కంటే ఎక్కువగా సిబిల్ స్కోరు ఉన్న వారికి 6.90 శాతం రుణ రేటు వర్తిస్తుంది. రుణాన్ని పొందాలని అనుకునే వారికి రూ.50 లక్షల వరకు కంపెనీ గృహ రుణం ప్రస్తుతం అందిస్తోంది.

చదవండి:

పిల్లల కోసం ఎల్ఐసీ ప్రత్యేక పాలసీ!

మరిన్ని వార్తలు