LIC IPO: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!

25 Feb, 2022 15:04 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్‌లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్‌లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది. 

అయితే, ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ గతంలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది.  

(చదవండి: అదిరిపోయే బంప‌రాఫ‌ర్‌!! 60శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్‌!) 

మరిన్ని వార్తలు