ఎల్‌ఐసీ ఐపీవో: కేంద్రం కొత్త వ్యూహం

4 Jun, 2021 14:22 IST|Sakshi

 ఎల్‌ఐసీ ఐపీవో

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల పెట్టుబడులపై కేంద్రం ఆసక్తి

త్వరలోనే ఆహ్వానాలు

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ  బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఐపీవో త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన  ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి బ్యాంకుల నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని భావిస్తోంది.  ఈ నెలలోనే ఈ  ప్రతిపాదనలను పరిశీలించనుంది. ఎల్‌ఐసీలోని వాటాల అమ్మకానికి సంబంధించి రానున్న రోజుల్లో  ఆహ్వానాలను పంపించనుందని తెలుస్తోంది.  

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. వచ్చే కొన్ని వారాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఇన్విటేషన్లనుపంపే అవకాశముంది. ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ ఇండియా విశ్లేషకుల అంచనా ప్రకారఘీ ఐపీవో విలువ సుమారు 261 బిలియన్ డాలర్లు రూ.19 లక్షల కోట్లు. ఇదే వ్యాల్యుయేషన్‌తో ఎల్‌ఐసీ మార్కెట్‌లో లిస్ట్ అయితే దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించనుందని  మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. కాగా 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి ఎల్‌ఐసీకి  సుమారు 32 ట్రిలియన్ డాలర్లు (439 బిలియన్ డాలర్ల) ఆస్తులుగా ఉన్నాయి.  దేశీయ మార్కెట్ వాటాను 70 శాతం. అటు ఎయిరిండియా,  ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో పాటు  ప్రతిష్టాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా  24 బిలియన్‌ డాలర్లను  సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

చదవండి : ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడి!
Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్‌!

మరిన్ని వార్తలు