మార్చిలో లిస్టింగ్‌కు సన్నాహాలు...

22 Feb, 2022 06:22 IST|Sakshi

పరిస్థితులు గమనిస్తున్నాం

ఉక్రెయిన్‌– రష్యా వివాదంపై దృష్టి

ఐపీఓపై ఎల్‌ఐసీ చీఫ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని మార్చిలో లిస్టింగ్‌ చేసేందుకు సన్నద్ధమై ఉన్నట్లు కంపెనీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆరి్థక సంవత్సరం(2021–22) ముగిసేలోగా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయనున్న అంచనాలతో అమెరికా అప్రమత్తమైన నేపథ్యంలో కుమార్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశి్చత పరిస్థితులు తలెత్తడంతో స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. మరోపక్క యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపులో సాగనున్న సంకేతాలు ఇస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–18 మధ్య నికరంగా రూ. 18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి వరుసగా ఐదో నెలలోనూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న ట్లు కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. కాగా.. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 63,000 కోట్ల సమీకరణతో సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది.

వీళ్లకూ డిస్కౌంట్‌..: ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన(పీఎంజేజేబీవై) సబ్‌్రస్కయిబర్లకు సైతం ఎల్‌ఐసీ ఐపీవో ధరలో డిస్కౌంటును అందించనున్నట్లు కుమార్‌ వెల్లడించారు. పాలసీదారులకు ఇస్తున్నట్లే వీరికీ తగ్గింపును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన పీఎంజేజేబీవై పొదుపు ఖాతా కలిగిన 18–50 ఏళ్ల వయసులోపు వారికి రూ. 330 వార్షిక ప్రీమి యంతో రూ. 2 లక్షల బీమా కవరేజీ అందిస్తోంది.

ఎల్‌ఐసీ.. ద లీడర్‌
బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ ప్రభుత్వ రుణ సాధనాలలో అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీగా నిలుస్తున్నట్లు స్వీస్‌ బ్రోకరేజీ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తాజాగా పేర్కొంది. మొత్తం జీసెక్యూరిటీస్‌లో 19 శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీలలోనూ అతిపెద్ద వాటాదారు, ఫండ్‌ మేనేజర్‌గానూ నిలుస్తున్నట్లు తెలియజేసింది. 520 బిలియన్‌ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదికలో యూబీఎస్‌ పేర్కొంది.

మొత్తం ఈక్విటీలలో 4 శాతం వాటాతో ప్రభుత్వం(ప్రమోటర్‌) తదుపరి ఒకేఒక అతిపెద్ద వాటాదారుగా రికార్డును నెలకొలి్పనట్లు వివరించింది. 2021 డిసెంబర్‌కల్లా బ్లూచిప్‌ కంపెనీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10 శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీలలో 5 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంది. వీటితోపాటు బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్‌బీఐలో 4 శాతం వాటా ఉంది. ఇక డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీలోనూ 4 శాతం వాటాను పొందింది. ప్రతిఏటా కుటుంబ పొదుపు రూ. 100లో రూ. 10 వరకూ ఎల్‌ఐసీకి చేరుతున్నట్లు తెలియజేసింది.  

మరిన్ని వార్తలు