ఎల్‌ఐసీ: రోజుకు రూ.55 కడితే చేతికి రూ.13 లక్షలు!

15 Feb, 2021 19:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్ఐసీ అత్యంత విశ్వసనీయ సంస్థ. ఎల్‌ఐసి పాలసీలో ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఈ సంస్థను ప్రభుత్వం నిర్వహిస్తుంది. పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టేందుకు ఎప్పటి కప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తుంది. ఎల్‌ఐసీ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి బాగా పేరొచ్చింది. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. ఆ పాలసీలో కొన్ని మార్పులు చేసి కొన్ని నెలల క్రితం ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకొచ్చింది ఎల్ఐసీ.

ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో చేరడానికి వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి. కనీస బీమా లక్ష ఉండగా గరిష్ట పరిమితి లేదు. 15 నుంచి 35 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. ఉదాహరణకు పాలసీ దారుడు మీరు రూ.5 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుందాం. మీరు 35 ఏళ్ల వయస్సులో 25 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న వ్యక్తి నెలకు రూ.1650 (రోజుకు రూ.55 ఆదా చేయాలి) చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలలకు అయితే రూ.5000 కట్టాలి. అదే ఆరు నెలలకు అయితే రూ.10,000 చెల్లించాలి. సంవత్సరానికి అయితే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ పాలసీ గడువులోపే పాలసీ దారుడు మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు లభిస్తాయి. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్‌ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75,000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయస్సు నాటికీ పాలసీదారునికి మొత్తం 13,00,000 రూపాయలు లభిస్తాయి.
 

చదవండి:
బిట్ కాయిన్‌కు కెన‌డా గ్రీన్ సిగ్న‌ల్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

మరిన్ని వార్తలు