ఎల్‌ఐసీ ఫలితాలు.. ప్చ్‌!

31 May, 2022 08:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే ఐపీవోకు వచ్చిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ జనవరి– మార్చిలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో స్టాండెలోన్‌ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,372 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,893 కోట్లు ఆర్జించింది.

అయితే నికర ప్రీమియం ఆదాయం రూ. 1.22 లక్షల కోట్ల నుంచి రూ. 1.44 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 18 శాతం వృద్ధికాగా.. తొలిసారి వాటాదారులకు డివిడెండ్‌ ప్రకటించింది. షేరుకి రూ. 1.50 చొప్పున చెల్లించనుంది.

కాగా.. క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం సైతం 17 శాతం నీరసించి రూ. 2,409 కోట్లకు చేరింది. 2020–21 క్యూ4లో రూ. 2,917 కోట్లు ఆర్జించింది. మార్చికల్లా కంపెనీ సాల్వెన్సీ రేషియో 1.76 శాతం నుంచి 1.85 శాతానికి మెరుగుపడింది. కంపెనీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తదుపరి తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.  

ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు 2 శాతం బలపడి రూ. 837 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు