ఎన్‌ఎండీసీలో ఎల్‌ఐసీ వాటా విక్రయం

16 Mar, 2023 15:37 IST|Sakshi

న్యూఢిల్లీ: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తాజాగా ఎన్‌ఎండీసీలో 2 శాతం వాటాను విక్రయించింది. దీంతో ఈ కంపెనీలో ఎల్‌ఐసీ వాటా మార్చి 14 నాటికి 11.69 శాతానికి వచ్చి చేరింది. తద్వారా రూ.700 కోట్లు సమకూరింది. బహిరంగ మార్కెట్లో 2022 డిసెంబర్‌ 29 నుంచి 2023 మార్చి 14 మధ్య 5.88 కోట్ల షేర్లను ఒక్కొక్కటి సగటున రూ.119.37కు ఎల్‌ఐసీ విక్రయించింది.

ఈ విక్రయం  ఫలితంగా ఎల్‌ఐసీ హోల్డింగ్ 13.699 శాతంనుంచి  11.69శాతానికి దిగి వచ్చిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి తెలియజేసింది. దీంతో షేర్ల పరంగా ఎన్‌ఎండిసిలో ఎల్‌ఐసీ హోల్డింగ్ 40,14,72,157 నుండి 34,25,97,574 ఈక్విటీ షేర్లకు తగ్గింది. 

 ఇది కూడా చదవండి: లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
250 కోట్ల బిగ్గెస్ట్‌ ప్రాపర్టీ డీల్‌: మాజీ ఛాంపియన్‌, బజాజ్‌ ఆటో చైర్మన్‌ రికార్డు

మరిన్ని వార్తలు