ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంత‌లోనే భారీ షాక్‌!!

9 Feb, 2022 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్‌– ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. 

 దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్‌ ప్రీమియంను వసూలు చేశాయి.  

 ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)  కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు.  

 ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. 

 మొత్తం మార్కెట్‌లో ఎల్‌ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్‌ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్‌ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది.  

హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలపైనా లేట్‌ ఫీజులో రాయితీ ఈ ఆఫర్‌లో ప్రత్యేకత. ఇక పబ్లిక్‌ ఇష్యూకు రావడానికి కూడా ఎల్‌ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు