రూ. 5.41 లక్షల కోట్లకు..ఎల్‌ఐసీ ఇండియన్‌ ఎంబెడెడ్‌ విలువ!

15 Jul, 2022 08:14 IST|Sakshi

ముంబై: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) 2022 మార్చికల్లా ఇండియన్‌ ఎంబెడెడ్‌ విలువ(ఐఈవీ)ను రూ. 5,41,492 కోట్లుగా మదింపు చేసింది. గతేడాది(2021) ఇదే కాలానికి కంపెనీ ఐఈవీ రూ. 95,605 కోట్లుగా నమోదైంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌లో వాటాదారుల కన్సాలిడేటెడ్‌ విలువను ఎంబెడెడ్‌ విలువ(ఈవీ)గా పేర్కొంటారు. 

ఐఈవీ మదింపును మిల్లీమ్యాన్‌ అడ్వయిజర్స్‌ పూర్తి చేసినట్లు ఎల్‌ఐసీ ఎండీ రాజ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇకపై ఐఈవీని ఆరు నెలలకోసారి వెల్లడించనున్నట్లు తెలియజేశారు. కాగా.. 2021 సెప్టెంబర్‌ చివరికి ఐఈవీ రూ. 5,39,686 కోట్లకు చేరినట్లు ఎల్‌ఐసీ తెలియజేసింది.

మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కొత్త బిజినెస్‌ విలువ(వీఎన్‌బీ) రూ. 7,6019 కోట్లు చేరింది. 2020–21 మార్చికల్లా వీఎన్‌బీ రూ. 4,167 కోట్లుగా నమోదైంది. గతేడాది వీఎన్‌బీ మార్జిన్‌ 9.9 శాతం నుంచి 15.1 శాతానికి బలపడింది. ఇక వార్షిక ప్రీమియం(ఏపీఈ) రూ. 45,588 కోట్ల నుంచి రూ. 50,390 కోట్లకు బలపడింది. కాగా, ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 0.5 శాతం నీరసించి రూ. 715 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు