హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఎల్‌ఐసీ పాలసీలు..నిమిషానికి ఎంతంటే..?

20 Apr, 2022 07:45 IST|Sakshi

2021–22లో 2.17 కోట్ల పాలసీల అమ్మకాలు 

నిమిషానికి 41 ఎల్‌ఐసీ పాలసీల విక్రయం

ముంబై: ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021–22 ఆర్థిక సంవత్సరం లో 2.17 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయించింది. 2020–21లో విక్రయించిన 2.10 కోట్ల పాలసీలతో పోలిస్తే 3.54 శాతం వృద్ధి కనిపించింది. ప్రతి నిమిషానికి 41 పాలసీలను విక్రయించినట్టు ఎల్‌ఐసీ తెలిపింది.

మొత్తం గ్రూపు ఇన్సూరెన్స్‌ పాలసీల స్థూల ఆదాయం (జీఆర్‌పీ) 2021–22లో 12.66 శాతం పెరిగి రూ.1,43,938 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,27,768 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇండివిడ్యువల్‌ (వ్యక్తులకు సంబంధించి విడిగా తీసుకునే) నాన్‌ సింగిల్‌ ప్రీమియం 8.82% వృద్ధి చెంది రూ.30,016 కోట్లుగా ఉంటే, ఇండివిడ్యువల్‌ సింగిల్‌ ప్రీమియం సైతం 61% వృద్ధితో రూ.4,018 కోట్లుగా ఉన్నట్టు ఎల్‌ఐసీ ప్రకటించింది. మొదటి ఏడాది ప్రీమియం మార్కెట్‌లో 63.25% వాటా సంస్థ చేతిలో ఉంది.

చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?

మరిన్ని వార్తలు