నూతన ప్రీమియం ఆదాయం రూ.3.14 లక్షల కోట్లు ..ఎల్‌ఐసీ ఆదాయం ఎంతంటే..?

19 Apr, 2022 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్ని జీవిత బీమా సంస్థలకు సంబంధించి నూతన ప్రీమియం ఆదాయం 2021–22లో 13 శాతం వృద్ధితో రూ.3,14,263 కోట్లకు దూసుకుపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 24 జీవిత బీమా కంపెనీల ఉమ్మడి ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో) ఆదాయం రూ.2,78,278 కోట్లుగా ఉన్నట్టు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎల్‌ఐసీ నూతన బిజినెస్‌ ప్రీమియం 8 శాతం వృద్ధితో రూ.1,98,760 కోట్లుగా నమోదైంది. అంతకుందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,84,174 కోట్లుగా ఉండడం గమనార్హం. మిగిలిన 23 ప్రైవేటు జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం రూ.1,15,503 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.94,103 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగింది.    

చదవండి: 2021–22లో 1.67 లక్షల కొత్త కంపెనీలు...ఆ రాష్టంలోనే అధికం..!

మరిన్ని వార్తలు