జీవిత బీమా ప్రీమియం ఆదాయంలో వృద్ధి

9 Oct, 2021 06:41 IST|Sakshi

సెప్టెంబర్‌లో భారీ ఆదాయం

ఆరు నెలల్లోనూ 5.8 శాతం వృద్ధి

ముంబై: జీవిత బీమా కంపెనీలు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో మంచి పనితీరు చూపించాయి. మొదటి ఏడాది పాలసీల ప్రీమియం ఆదాయం 22.2 శాతం వృద్ధిని చూపించింది. రూ.31,001 కోట్ల ఆదాయం సమకూరింది. 2020 సెపె్టంబర్‌లో ఈ రూపంలో కంపెనీలకు వచ్చిన ఆదాయం రూ.25,336 కోట్లుగానే ఉంది. బీమా రంగంలోనే దిగ్గజ కంపెనీ ఎల్‌ఐసీ మొదటి ఏడాది ప్రీమియం సెప్టెంబర్‌ నెలలో 11.5 శాతం పెరిగింది. కానీ 2020 సెప్టెంబర్‌లో వృద్ధి 30 శాతంతో పోలిస్తే తగ్గినట్టు స్పష్టమవుతోంది.  

ఏప్రిల్‌–సెప్టెంబర్‌లోనూ మంచిపనితీరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) జీవిత బీమా కంపెనీల తొలి ఏడాది ప్రీమియం (కొత్త పాలసీలకు సంబంధించి) 5.8 శాతం వృద్ధి చెంది రూ.1,31,982 కోట్లుగా నమోదైంది. కానీ అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 0.8 శాతం పడిపోవడం గమనార్హం. ఎల్‌ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయం 3.3 శాతం తగ్గి రూ.85,113 కోట్లుగా ఉంది. అదే మిగిలిన ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీల తొలి పాలసీ ప్రీమియం ఆదాయం 27.7 శాతం వృద్ధి చెంది రూ.46,869 కోట్లకు చేరింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు