చైనా నుంచి నెమ్మదిగా సైడ్‌.. భారత్‌ మార్కెట్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌

2 Dec, 2021 17:09 IST|Sakshi

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని ‘లింక్డిన్‌’ అడుగులు భారత్‌ వైపు పడ్డాయి. హిందీ మాట్లాడేవాళ్ల కోసం లింక్డిన్‌ని హిందీ భాషలో అందుబాటులోకి తెచ్చింది. 


ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌లలో టాప్‌ పొజిషన్‌లో ఉన్న లింక్డిన్‌.. గురువారం నుంచి హిందీ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 25 ప్రధాన భాషల్లో సేవలు అందిస్తున్నట్లయ్యింది. మొబైల్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్‌లలో లింక్డిన్‌ మెంబర్స్‌ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.  

చైనాతో పొసగకే!
ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం ఆంక్షల వల్ల వరుసగా ఎంఎన్‌సీలు ఆ దేశాన్ని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ దెబ్బకు చైనాలో మిగిలిన ఏకైక అతిపెద్ద విదేశీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌.  అయితే ఆ నిబంధనల వల్ల లింక్డిన్‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే 54 మిలియన్ల యూజర్ల కోసం.. ఇన్‌జాబ్స్‌ (లింక్డ్ ఇన్‌లో మాదిరి యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు) పేరుతో ఓ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయించింది. ఈ తరుణంలో చైనాను వీడేందుకే.. భారత్‌ వైపు అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే ఇక్కడి యూజర్లను ఆకర్షించేందుకే ‘హిందీ’ అడుగు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. 

ఇక లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా.. గత మూడేళ్లలో 20 మిలియన్ల మంది లింక్డిన్‌ యూజర్లు పెరిగారు భారత్‌లో. దీంతో భారత్‌లో యూజర్లను పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది మైక్రోసాఫ్ట్‌.  బిజినెస్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ఒరియెంటెడ్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ ‘లింక్డిన్‌’..  2003లో మే5న అమెరికా నుంచి తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. వెబ్‌సైట్‌, యాప్‌ల రూపంలో సర్వీసులు అందిస్తోంది. ఇక 2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్‌.. అమెరికా తర్వాత చైనాలోనే అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చైనా మార్కెట్‌ నుంచి నెమ్మదిగా జరుగుతూ.. భారత్‌కు చేరువవుతుండడం విశేషం.

చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు!

మరిన్ని వార్తలు