Lionel Messi Net Worth: వామ్మో.. లియోనల్‌ మెస్సీ ఆస్తుల చిట్టా వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

19 Dec, 2022 18:15 IST|Sakshi

మూడున్నర దశాబ్ధాల అర్జెంటీనా నిరీక్షణ ఫలించింది. ఆదివారం అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-2 తేడాతో  డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌ కప్‌ను గెలుచుకుంది. జగజ్జేతగా మెస్సీ బృందం నిలిచింది. 

అలాంటి ఫుట్‌బాల్‌ మైదానంలో మెస్సీ కొదమ సింహంలా పోటీ పడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉగిపోయేలా చేసింది. అలాంటి ఫుట్‌బాల్‌ లెజెండ్‌లో వే(ఆ)టగాడే కాదు ఓ మంచి బిజినెస్‌ మ్యాన్‌ కూడా ఉన్నాడు.   


 
ఫోర్బ్స్‌ కథనం ప్రకారం.. 

మెస్సీ గతేడాది ఆశ్చర్యంగా 75 మిలియన్లు సంపాదించాడు. ఈ సంపాదన భూమ్మిద ఉన్న ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ 

ఫుట్‌ బాల్‌ టీమ్‌ పారిస్ సెయింట్-జర్మైన్ ఎఫ్‌సీ ఇచ్చే జీతం మాత్రమే సంవత్సరానికి  35 మిలియన్లు. అంటే మెస్సీ వారానికి  738,000 డాలర్లు , రోజుకు 105,000 , గంటకు 8,790 సంపాదిస్తారు.

గత వేసవిలో అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్‌ చేసిన మెస్సీ ఏకంగా 25 మిలియన్లు సంపాదించారు.  

రోజర్‌ ఫెదర్‌తో సమానంగా

►గతేడాది మెస్సీ ఆఫ్ ఫీల్డ్ సంపాదన 55 మిలియన్లు ఉండగా..టెన్నిస్ ఐకాన్ రోజర్ ఫెదరర్, ఎన్‌బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మాత్రమే ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్‌ఫారమ్ సోషియోస్‌తో సంవత్సరానికి  20 మిలియన్ల భాగస్వామ్యంతో పాటు, 35 ఏళ్ల ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో అడిడాస్, బడ్‌వైజర్,పెప్సికోతో ఒప్పందాలు ఉన్నాయి.

గత జూన్‌లో, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ మొట్టమొదటి అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరించాడు.  

1 బిలియన్‌ కంటే ఎక్కువే
ఫోర్బ్స్ ప్రకారం, మెస్సీ ఆటగాడిగా, ఇతర బిజినెస్‌లలో రాణిస్తూ 1.15 బిలియన్ల కంటే ఎక్కువ సంపాదించారు.  ప్రస్తుతం  లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో ​​రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదనలో ముందంజలో ఉన్నారు. పైన పేర్కొన్న వారి కంటే  రోజర్ ఫెదరర్, ఫ్లాయిడ్ మేవెదర్ మాత్రమే కెరీర్ సంపాదనలో  1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపాదించారు. 

కార్లంటే మహా ఇష్టం
మెస్సీ సంపాదనలో సగ భాగం కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మెస్సీ వద్ద 2 మిలియన్ల ధర పలికే  పగని జోండా ట్రైకలర్, ఫెరారీ ఎఫ్‌4 30 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్‌ఆర్‌టీ8, మసెరటి గ్రాన్ టురిస్మో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

2016 అర్జెంటీనాలో  37 మిలియన్లకు 1957 ఫెరారీ 335 స్పోర్ట్ స్పైడర్ స్కాగ్లియెట్టి అనే ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు పుకారు వచ్చింది. అయితే, ఇదే నా కొత్త కారు అంటూ బొమ్మ కారును పట్టుకొని ఆ పుకార్లకు చెక్‌ పెట్టారు.  

విలాసవంత మైన భవనాలు 
మెస్సీ ఆస్తులలో అత్యంత విలాసవంతమైనది బార్సిలోనా శివార్లలో 7 మిలియన్ల భవనం. నో-ఫ్లై జోన్ సబర్బ్‌లో ఉన్న భవనంలో స్విమ్మింగ్‌ పూల్‌, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా ఉన్నాయి.  
  
ఫుట్‌బాల్ పిచ్ కూడా 
మెస్సీకి ఇంద్ర భవనాన్ని తలపించాలే ఎకో-హౌస్ ఉంది. అర్జెంటీనాలోని తన సొంత పట్టణం రోసారియోలో ఒక భవనం, ఫ్లోరిడాలోని సెయింట్ ఐల్స్ బీచ్‌లోని ఒక విలాసవంతమైన కండోమినియంలు ఉన్నాయి. ఇందుకోసం గతేడాది 7.3 మిలియన్లు చెల్లించాడు. 2017 నుండి మెజెస్టిక్ హోటల్ గ్రూప్ నిర్వహించే  ఇబిజా, మజోర్కా, బార్సిలోనాలో రిసార్ట్‌లతో పాటు , ఎంఐఎం పేరుతో ఉన్న హోటల్ చైన్‌లు సైతం మెస్సీకి చెందినవే. 

2021లో మెస్సీ వింటర్‌ సీజన్‌లో విడిది కోసం అరన్ వ్యాలీలో పైరినీస్ నడిబొడ్డున రిసార్ట్‌ను ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం..ఫోర్ స్టార్ హోటల్‌లో 141 గదులు ఉన్నాయి. స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫిట్‌నెస్ సెంటర్, మౌంటెన్‌ గైడ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.  

బాల్కనీ పెద్దగా ఉందని 
మెస్సీ 2017లో 35 మిలియన్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భవనంలో బాల్కనీ పెద్దగా ఉందని.. మొత్తాన్ని కూల్చేయించారు. కారణంగా బాల్కనీలను తీసివేయడానికి,  తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేసినా హోటల్ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేక మొత్తం పడగొట్టాల్సి వచ్చింది

15 మిలియన్ల ప్రైవేట్‌ జెట్‌
మెస్సీకి గల్ఫ్‌స్ట్రీమ్ వీ అనే ప్రైవేట్‌ ఉంది. అందులో  రెండు కిచెన్‌లు, బాత్‌రూమ్‌లు ఉన్నాయి. గరిష్టంగా పదహారు మంది ప్రయాణికులు సేద తీరే సౌకర్యాలు ఉన్నాయి.  

దానంలో కలియుగ కర్ణుడు
2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది.ఆ ఫౌండేషన్‌ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది.

యునిసెఫ్ ప్రకారం..2017లో మెస్సీ సిరియాలో 1,600 మంది అనాథ పిల్లలకు తరగతి గదులను నిర్మించడంలో ఫౌండేషన్‌కు సహాయం చేయడానికి తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 2019లో కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించడానికి ఫౌండేషన్ $218,000 విరాళంగా అందించింది.  

చివరిగా కండోమినియం అంటే? 
అమ్మకం కోసం ఒక పెద్ద ఆస్తిని ఒకే యూనిట్‌లుగా విభజించినప్పుడు దానిని కండోమినియం కాంప్లెక్స్‌గా సూచిస్తారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు