డిజిటల్‌కి ‘నిషా’ ఎక్కుతోంది

22 Jun, 2021 12:44 IST|Sakshi

డిజిటల్‌లో పెరుగుతున్న ఆల్కహాల్‌ ‍బ్రాండ్‌ ప్రమోషన్‌

సంప్రదాయ పద్దతిలో ఆల్కహాల్‌ ప్రచారంపై నిషేధం

ఆన్‌లైన్‌ ప్రచారానికి మొగ్గు చూపుతున్న ఆల్కహాల్‌ కంపెనీలు 

ఆల్కహాల్‌ బ్రాండ్లు డిజిటల్‌ బాట పట్టాయి. ఇంటర్నెట్‌ వేదికగా ప్రచారం చేయడంపై దృష్టి సారించాయి. ఈ కామర్స్‌ సైట్లలో స్థానం ఆక్రయమించి తమ బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్‌ పెరిగింది. 

ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించించి. పత్రిక, టీవీ, హోర్డింగ్‌ తదితర సంప్రదాయ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడాన్ని నిషేధించాయి. దీంతో చాలా ఆల్కహాల్‌ కంపెనీలు మినరల్‌ వాటర్‌, క్యాసెట్స్‌ అండ్‌ సీడీస్‌ , ప్యాకేజ్డ్‌ వాటర్‌ తదితర పేర్లతో తమ బ్రాండ్లను పరమిత స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి.

సంప్రదాయ పద్దతిలో ఆల్కహాల్‌ ప్రచారానికి అనేక అడ్డంకులు ఉండటంతో ఆల్కహాల్‌ కంపెనీలు డిజిటల్‌ బాట పట్టాయి. గతేడాది ఆల్కహాల్‌ ప్రచారంపై తయారీ సంస్థలు రూ. 750 కోట్లు ఖర్చు చేశారని అంచనా. ఇందులో కనీసం 25 నుంచి 28 శాతం వరకు అడ్వర్‌టైజ్‌మెంట్లు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కే దక్కాయి. అంతకు ముందు ఏడాది ఈ వాటా18 నుంచి 20 శాతం మధ్యనే ఉంది. 

ఫన్‌, ఇన్ఫర్మేటివ్‌ పద్దతిలో క్రియేటివ్‌గా రూపొందించిన యాడ్స్‌ని ఈ కామర్స్‌ సైట్స్‌, ఓటీటీ , సోషల్‌ మీడియా ద్వారా ప్రముఖ కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి తోడు కరోనా సెకండ్‌ వేవ్‌ సందర్భంగా ఢిల్లీ, వెస్ట్‌ బెంగాల్‌, ఓడిషా, మహారాష్ట్ర, ఝార్కండ్‌ తదితర రాష్ట్రాలు ఆల్క్‌హాల్‌ హోం డెలివరీకి అవకాశం కల్పించాయి. దీంతో ఆల్కహాల్ యూజర్లు కూడా డిజిటల్‌ బాట పడుతున్నారు. న్‌లైన్‌లో ఆల్కహాల్‌ డెలివరీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. 

చదవండి : ఈ-కామర్స్‌కు కఠిన నిబంధనలు.. ఫ్లాష్‌ సేల్స్‌ నిషేధం!

మరిన్ని వార్తలు