ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం?

28 Jul, 2021 15:16 IST|Sakshi

మీరు 5 ఏళ్ల లోపు చిన్న పిల్లల కోసం ఆధార్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, చిన్న పిల్లల ఆధార్ కోసం మీ దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆధార్ కేంద్రానికి ఒరిజినల్ పత్రాలను తీసుకెళ్లాలి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్స్ క్యాప్చర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్(యుఐడీ) అనేది వారి తల్లిదండ్రుల యుఐడీతో లింక్ చేసిన డెమోగ్రాఫిక్ సమాచారం, పిల్లల ముఖ ఛాయాచిత్రం ఆధారంగా ప్రాసెస్ చేస్తారు.

అయితే, ఈ మైనర్లకు 5 ఏళ్ల నుంచి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పది వేళ్లు, ఐరిస్, ఫోటోగ్రాఫ్ వంటి బయోమెట్రిక్ లను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ప్రమాణీకరణ కొరకు తల్లిదండ్రులు బిడ్డతో (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు) ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ కోసం కింద పేర్కొన్న రెండు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

  • పిల్లల జనన ధృవీకరణ పత్రం / ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ స్లిప్ / పిల్లల స్కూలు ఐడీ 
  • పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్
మరిన్ని వార్తలు