LML Electric Scooters: క్యూట్‌ డిజైన్‌, రెట్రో లు‍క్స్‌తో కొత్త ఇన్నింగ్స్‌

14 Sep, 2022 13:49 IST|Sakshi

ఎల్‌ఎంఎల్‌ స్కూటర్లు గుర్తున్నాయా? 

ఆధునిక డిజైన్‌, రెట్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు,బైక్స్‌

సాక్షి,ముంబై: టూవీలర్ మార్కెట్లో సంచలనం ఎల్ఎంఎల్ (లోహియా మెషీన్స్ లిమిటెడ్) స్కూటర్స్ గుర్తున్నాయా? ఇపుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-స్కూటర్లతో మళ్లీ మర్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆధునిక డిజైన్‌, రెట్రో లుక్‌లో ఈ-స్కూటర్లు, బైక్స్‌ను లాంచ్‌ చేయనుంది.

కాన్పూర్‌కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లను  త్వరలోనే లాంచ్‌ చేయనుంది. ఎస్‌జీ కార్పొరేట్ మొబిలిటీ యాజమాన్యం కింద, ఎల్‌ఎంఎల్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29న ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌తో మూడు వాహనాలను పరిచయం చేయనుంది. బైక్స్‌, ఇ-స్కూటర్‌లు రెండింటికీ సంబంధించి  ప్రకటన ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ బైక్‌లు 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. అంతేకాదు వీటిని   దేశీయ మార్కెట్‌కు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయనుంది.

రానున్న 3-5 ఏళ్లలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హర్యానా మనేసర్‌లోని హార్లే-డేవిడ్‌సన్ తయారీ యూనిట్‌లోనే ఈ బైక్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000ఎల్‌ఎమ్‌ఎల్ డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని కూడా  యోచిస్తోంది. కాగా 90లలో ఎల్‌ఎంఎల్‌ వెస్పా పేరు తెలియని వారుండరు. 100 సీసీ శ్రేణితో బజాజ్ స్కూటర్‌లతో పెద్ద పోటీనే ఉండేది.  ఈ పోటీని తట్టుకోలేక 2018లో మూతపడింది ఎల్‌ఎంఎల్‌.

మరిన్ని వార్తలు