Pan Card: మీ పాన్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

1 Dec, 2021 15:04 IST|Sakshi

Download e-PAN Card: మన దేశంలో ఆధార కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పాన్‌ కార్డుకు ఉంది. అధిక మొత్తంలో నిర్వహించే ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి అనే విషయం మన అందరికీ తెలుసు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దరఖాస్తు చేసుకోవడం, వివిద పథకాలలో పెట్టుబడి పెట్టాలి అన్న పాన్ కార్డు అవ‌స‌రం. అయితే, ఇలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే, ఇక నుంచి భయడాల్సిన అవసరం లేదు. మీ పాన్‌ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ విభాగం కల్పిస్తోంది.

పాన్ కార్డు పోతే కొత్త ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా?

  • మొదట ఈ ఎన్‌ఎస్‌డీఎల్ పోర్టల్ లింకు ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు పోగొట్టుకున్న మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన్ కోడ్ నమోదు చేయాలి.
  • మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఈ-పాన్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

(చదవండి: రేషన్‌ షాపుల్లో మినీ ఎల్‌పీజీ సిలిండర్లు..!)

మరిన్ని వార్తలు