తక్కువ వడ్డీ రేటుతో హోంలోను

27 Oct, 2021 08:01 IST|Sakshi

న్యూఢిల్లీ: గృహ రుణ రేటును చరిత్రాత్మక కనిష్టం 6.4%కి తగ్గించినట్లు ప్రభుత్వ రంగ  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 27 నుంచి తగ్గించిన వడ్డీరేటు అమల్లోకి వస్తుంది. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్‌లకు లేదా బ్యాలెన్స్‌ బదిలీలతో సహా ప్రస్తుత రుణాలను బదిలీ చేయాలనుకునే వారికి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ పేర్కొంది.

 ‘పండుగ సీజన్‌లో గృహాలను కొనుగోలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను మేము గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో కస్టమర్‌లు ఈ ఆఫర్‌ నుండి ప్రయోజనం పొందుతారు. ఈ తగ్గిన వడ్డీ రేటుతో యూబీఐ గృహ రుణ రేటు పరిశ్రమలో అత్యంత పోటీగా మారింది‘ అని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 

చదవండి: బ్యాంకుల్లో బంపర్‌ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్‌ చేస్తున్నారా?

మరిన్ని వార్తలు