BMW: ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రేజ్‌ రావాలంటే..ఇలా చేయాల్సిందే..!

28 Nov, 2021 19:07 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. టెస్లా లాంటి కంపెనీలు భారత్‌లోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తుండగా...అధిక దిగుమతి సుంకాలతో టెస్లా ఏంట్రీ కాస్త నెమ్మదించింది. ఇతర విదేశీ కంపెనీలు కూడా భారత్‌లోనే అడుగుపెట్టేందుకు సన్నహాలను చేస్తున్నాయి. కాగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు క్రేజ్‌ రావాలంటే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకోవాలని​ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సూచించింది. ఒక నిర్ణీత కాలం పాటు లేదా పరిమిత​ యూనిట్లపై ఇంపోర్ట్‌ టాక్స్‌ తగ్గించాలని బీఎండబ్ల్యూ పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ వెల్లడించింది. 

తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం..!
అధిక దిగుమతి సుంకాలు తగ్గితే...భారత్‌లోనే పలు దిగ్గజ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉందని బీఎండబ్ల్యూ అభిప్రాయపడింది. బీఎండబ్ల్యూ వాహనాలకు భారత్‌లో క్రేజ్‌ ఉండడంతో గత 15 ఏళ్లుగా తమ కంపెనీ భారత్‌లోనే పలు మోడళ్లను తయారు చేస్తోందని బీఎండబ్ల్యూ తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో మూడు విద్యుత్తు కార్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు బీఎండబ్ల్యూ ఇటీవల ప్రకటించింది.  

విదేశీ కార్లపై దిగుమతి సుంకాలు 100 శాతం వరకు..!
విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది.  ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. 
చదవండి: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్ ఆసియా విషయంలో టాటా సన్స్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు