LPG Cylinder Gas Price Today: తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ ధర! ఎంతంటే!

1 Jul, 2022 09:42 IST|Sakshi

పెరిగిన,పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు గ్యాస్‌ కంపెనీలు ఊరట నిచ్చాయి.కమర్షియల్‌ గ్యాస్‌ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయించాయి. తగ్గిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 

చమురు కంపెనీల నిర్ణయంతో దేశంలోని ప్రాంతాల వారీగా కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు అదుపులోకి వచ్చాయి.ఢిల్లీలో 19కేజీల కమర్షియల్‌ గ‍్యాస్‌ ధర రూ.198తగ్గింది. కోల్‌కతాలో రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గాయి. 

గతంలో ఎంత తగ్గిందంటే 
చమురు కంపెనీలు  వ్యాపారానికి వినియోగించే గ్యాస్‌ ధరల్ని వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో జూన్‌ 1న అదే గ్యాస్‌ ధరను రూ.135 తగ్గించాయి. కానీ 14.2 కిలోల వంట గ్యాస్‌ ధరల్లో ఎలాంటి తగ్గుముఖం కనిపించగా పోగా..వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క మే నెలలో వంటింట్లో వాడే వంట గ్యాస్‌ ధరను రెండు సార్లు పెంచాయి. తొలిసారిగా మే 7న లీటరుకు రూ.50 పెంచగా.. మే 19న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.3.50పెరిగాయి.

మరిన్ని వార్తలు