LPG Gas Price: పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర

6 Oct, 2021 09:41 IST|Sakshi

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ మంటెత్తాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధ‌ర‌లతో సిలిండ‌ర్ల ధ‌ర‌లు ఆకాశానికి చేరుతున్నాయి. దీంతో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర బుధవారం రూ.15 పెరిగింది. ఢిల్లీలో నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.899.50చేరింది.

కాగా సెప్టెంబర్‌ నెలలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది. ఇక తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం గ్యాస్‌ ధర  రూ.190 పెంచినట్లైంది.  

చమరు కంపెనీలు రెండు నెలల్లో నాన్‌ సబ్సిడీ గ్యాస్‌ సిలీండర్‌ ధరలు అమాంతం పెంచాయి. ఆగస్ట్‌ 18న  నాన్‌ సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర ను రూ.25 పెంచగా..సెప్టెంబర్‌ నెలలో ఇదే నాన్‌ సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.25 పెరగడంతో సామాన్యులు లబోదిబో మంటున్నారు. 

మరింత పెరగనున్న వంట గ్యాస్‌ ధరలు

ఒకవైపు కరోనా..మరో వైపు ఆదాయం లేక సామాన్యుడు అప్పుల ఊబిలో చితికి పోతుంటే పెరుగుతున్న చమురు, గ్యాస్‌ ధరలు మరింత శాపంగా మారాయి. పెట్రోల్‌, డీజిల్   వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరగటం.. ఇపుడు గ్యాస్ సిలిండర్ ధర  కూడా పెరగడం మరింత భారం కానుంది.

అయితే  ఈ పెరుగుతున్న ధరల భారం కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్యాస్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్‌ 2021 నుంచి మార్చి 2022 మధ్య కాలంలో నేచురల్‌ గ్యాస్‌ ధర 50 నుంచి 60శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గ్యాస్‌ ధర ఆకాశాన్ని తాకనుంది.


చదవండి: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మరిన్ని వార్తలు