బాబోయ్‌..మ‌ళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధ‌ర‌లు!

24 Feb, 2022 16:25 IST|Sakshi

రానున్న రోజుల్లో ఎల్‌పీజీ గ్యాస్ ధరలు మ‌రింత పెరగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెర‌గ‌నున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మార‌నున్నాయి.  

జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్న‌ట్లు జాతీయ మీడియా త‌న  క‌థ‌నాల్లో పేర్కొన్నాయి.  

సీఎన్‌జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుద‌ల ప్ర‌ధాన కార‌ణం పెరుగుతున్న ర‌వాణా ఖ‌ర్చులు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులేన‌ని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవ‌స‌రాల్ని తీర్చ‌డంలో వైఫల్యం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే  2.9 డాల‌ర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవ‌కాశం ఉండ‌నుంది.

చ‌ద‌వండి: మ‌రో ప్ర‌మాదం అంచున ఉక్రెయిన్‌, ఇది ర‌ష్యా ప‌నేనా?!

మరిన్ని వార్తలు