గుడ్‌న్యూస్‌: బడ్జెట్‌ ముందర ఊరట.. సిలిండర్‌ ధరల నో ఛేంజ్‌! తగ్గించిన ధరలు ఇవే..

1 Feb, 2022 11:12 IST|Sakshi

బడ్జెట్‌ ముందర గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్‌ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్‌ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం.  ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే.

అక్టోబర్‌ నుంచి డొమెస్టిక్‌, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు అక్టోబర్‌ నుంచి తగ్గలేదు. నవంబర్‌ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు(OMCs) ఎల్పీజీ సిలిండర్‌ ధరలను కొన్ని ప్రాంతాల్లో తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి.

ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్‌ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్‌సిలిండర్‌ల ధరల‍్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్‌ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా  ఊరట ఇచ్చాయి. మరోవైపు ఆయిల్‌ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి. క్రూడ్‌ ఆయిల్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇది ప్రత్యేకమనే చెప్పాలి. 

ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్‌ డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో  డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్‌ సబ్సిడైజ్డ్‌ ఎల్పీజీ సిలిండర్‌ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్‌ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. 

ఇక ఓఎంసీ కమర్షియల్‌ సిలిండర్‌ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్‌ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్‌ సిలిండర్‌పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర  రూ. 1,907రూ.గా ఉంది.

మరిన్ని వార్తలు