20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..!

19 Sep, 2021 17:18 IST|Sakshi

వాషింగ్టన్‌:  ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించాయి. ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలను రోడ్లపైకి తెచ్చింది. టెస్లా కార్లు ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే సుమారు 758 కిలోమీటర్లకు వరకు ప్రయాణిస్తాయి. రేంజ్‌ విషయంలో టెస్లాను అధిగమించడానికి పలు ఆటోమొబైల్‌ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా టెస్లాకు పోటీగా అమెరికన్‌ స్టార్టప్‌ లూసిడ్‌ మోటార్స్‌ ఎయిర్‌ డ్రీమ్ ఎడిషన్‌ కారును తీసుకురానుంది. 
చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!


లూసిడ్‌ కార్లు టెస్లా కార్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.  టెస్లా కార్లకు పోటీగా  లూసిడ్‌ తన కారును తయారుచేస్తోంది. ఈ కారున ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే సుమారు 840 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి.ఇది టెస్లా మోడల్ ఎస్ లాంగ్ రేంజ్ కంటే 161 కిమీ ఎక్కువ దూరం ప్రయాణించగలదు.  అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ను ఏర్పాటుచేయడంతో   కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో ఈ కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్‌ వెల్లడించింది.  ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లూసిడ్‌ ఎయిర్‌ డ్రీమ్‌ ఈ ఎడాది చివర్లో అమ్మకాలను జరపాలని కంపెనీ భావిస్తోంది. ఈ కారు సుమారు రూ. 57 లక్షల నుంచి ప్రారంభమౌతున్నట్లు తెలుస్తోంది. లూసిడ్‌ ఎయిర్‌ డ్రీమ్‌ ఎడిషన్‌ 113కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీను అమర్చారు.  ఈ కారులో డ్యూయల్‌ ఆక్టివ్‌ కోర్‌ మోటార్‌ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కారులో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకుగాను సెమి ఆక్టివ్‌ సప్సెన్షన్‌ను వాడారు.

చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు