టెస్లాకు పోటీగా లూసిడ్‌ మోటార్స్‌..

10 Sep, 2020 19:36 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టప్ కంపెనీ లూసిడ్ మోటార్స్ ఆధునిక టెక్నాలజీకి, విలాసానికి పెట్టింది పేరు. స్పీడ్‌ డ్రైవింగ్‌ ఇష్టపడే వారికి లూసిడ్ శుభవార్త తెలిపింది. లూసిడ్‌ ఏయిర్‌ ఈవీ అనే మోడల్‌ కారు గంటకు 300 కిలోమీటర్లు వాయు వేగంతో ప్రయాణించనన్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్న టెస్లాకు ధీటుగా కొత్త ఎలక్ట్రిక్ కారును లూసిడ్ మోటార్స్‌ ఆవిష్కరించనుంది.

1/7 లూసిడ్ మోటార్స్ సిలికాన్ వ్యాలీ ప్రధాన కార్యాలయం గ్లోబల్ వెబ్ నుంచి ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఉత్పత్తి వెర్షన్‌ను ఆవిష్కరించనుంది.

2/7 డ్యూయల్ మోడల్‌ ఆర్కిటెక్చర్‌లో 1,080 హార్స్‌పవర్‌ను లూసిడ్‌ మోటార్స్‌ అత్యాధునిక సాంకేతికతతో ఆకట్టుకోనుంది

3/7 లూసిడ్‌ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనంగా చరిత్ర సృష్టించనుంది. ఇది ఒకే చార్జిపై 832 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు

4/7 సెడాన్ హెడ్‌ల్యాంప్స్‌లో విభిన్నమైన మైక్రో లెన్స్ సిస్టమ్ ఉంది. ఇవి అత్యంత ఖచ్చితమైన, అధునాతన లైటింగ్ వ్యవస్థను అందిస్తాయి.

5/7 మోడల్‌కు డ్రైవర్‌ సీటు ముందు 34 అంగుళాల కాక్‌పిట్ గ్లాస్, 5కే డిస్ప్లేతో ఆకర్శించనుంది

6/7 మోడల్‌లో సెంట్రల్ పైలట్ ప్యానెల్ వాహన వ్యవస్థలు, విధులను లోతుగా నియంత్రించడానికి డ్రైవర్‌కు, ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరం

7/7 మోడల్‌లో ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ అత్యాధునిక సాంకేతికతతో 2021 సంవత్సరంలో మార్కెట్లో విడుదల కానుంది.  


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు