హైడ్రోజన్‌ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 ‍కి.మీ

16 Nov, 2021 14:04 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల హవా ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే వాటికి పోటీగా మార్కెట్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి హైడ్రోజన్‌ కార్లు. మైలేజీ, స్పీడ్‌, మెయింటనెన్స్‌ విషయంలో ఎలక్ట్రిక్‌ కార్లతో పోటీ పడుతున్నాయి. అంతేకాదు లేటేస్ట్‌ టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకుని రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించేలా కొత్త రకం డిజైన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

వెనుకున్నది మన సత్యనే
భారతీయ అమెరికన్‌ సంత​ సత్య లుఫ్ట్‌కారు పేరుతో స్టార్టప్‌ నెలకొల్పారు. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌తో నడిచేలా ఫ్లైయింగ్‌కారును తయారు చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లు పూర్తయ్యాయి. 20213లో మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆటో ఎక్స్‌ప్లోలో ఈ కారుకు సంబంధించిన విశేషాలు దుబాయ్‌ షేక్‌లను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్కెట్‌లోకి రాకముందే ఈ కారుని కొనుగోలు చేసేందుకు దుబాయ్‌ షేక్‌లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైడ్రోజన్‌ కారు విశేషాలు ఏంటో ఓ​సారి చూద్దాం.

ప్లేన్‌లోనే కారు
సంత్‌సత్య రూపొందించిన లుఫ్ట్‌కారు భూమి మీద, ఆకాశంలో ప్రయాణం చేయగలదు. అటాచబుల్‌, డిటాచబుల్‌ పద్దతిలో ఈ కారును డిజైన్‌ చేయడం వల్ల ఈ కారు రెండు విధాలుగా ప్రయాణం చేయగలదు. ఈ కారు ఎగిరేందుకు వీలుగా నాలుగు ప్రొపెల్లర్లతో చేసిన డిజైన్‌ విమానం, హెలికాప్టర్ల నమూనాను పోలీ ఉంటుంది. ఇందులో మనుషులు ప్రయాణించేందుకు వీలుగా క్యాబిన్‌ ఉంటుంది. ఈ క్యాబిన్‌ డిటాచ్‌ చేస్తే రెగ్యులర్‌ కారు తరహాలో రోడ్డుపై ప్రయాణం చేయవచ్చు.

మ్యాగ్జిమమ్‌ స్పీడ్‌ 354 కి.మీ
లుఫ్ట్‌కారు గరిష్టంగా 4,000 అడుగుల ఎత్తు వరకు పైకి ప్రయాణం చేయగలదు. వాయు ఒక్కసారి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ నింపుకుంటే వాయు మార్గంలో గరిష్టంగా 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇక రోడ్డు మార్గంలో అయితే 241 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. వాయు మార్గంలో గరిష్ట వేగం గంటకి 354 కిలోమీటర్లు. ఈ కారులో గరిష్టంగా ఐదుగురు ప్రయాణం చేయవచ్చు. వర్టికల్‌గా ల్యాండింగ్‌ టేకాఫ్‌ తీసుకోగలదు. 

ధర ఎంతంటే
యూఎస్‌, యూరప్‌లతో పాటు సంపన్నులు ఎక్కువగా ఉండే దుబాయ్‌ లాంటి ప్రాంతాల్లో సంపన్నులు, నగరాల మధ్య నిత్యం ప్రయాణం చేసే బిజినెస్‌ పీపుల్‌ అవసరాలకు తగ్గట్టుగా ఈ కారుని డిజైన్‌ చేశారు. ఇంటి నుంచి ఎయిర్‌పోర్టు, ఎస్టేట్‌ తదితర ప్రదేశాల వరకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా వాయు మార్గంలో ప్రయాణించవచ్చు. అత్యవసర సమయంలో రోడ్డు మార్గంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ హైడ్రోజను కారు ధర 3.50,000 డాలర్లుగా ఉంది. 

చిన్న ప్లేన్‌తో పాటు కారు
లుఫ్ట్‌కారును కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు ఒకేసారి ఒక చిన్న ప్లేను, కారుని కొనుగోలు చేసినట్టు అవుతుంది. ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా కుటుంబంతో సహా ప్రయాణించేందుకు వీలు ఏర్పడుతుందని లుప్ట్‌కార సీఈవో సంత్‌ సత్య అంటున్నారు.

>
మరిన్ని వార్తలు