రెడీగా ఉండండి.. భారత్‌లో మరిన్ని షాపింగ్‌ మాల్స్‌

16 Aug, 2022 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: యూఏఈకి చెందిన లులూ గ్రూప్‌ భారత్‌లో మరిన్ని వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ కొచ్చి, త్రివేండం, బెంగళూరు, లక్నో, త్రిసూర్‌ నగరాల్లో రూ.7,000 కోట్ల వ్యయంతో ఐదు షాపింగ్‌ మాల్స్‌ను నిర్మించింది.

‘‘భారత మార్కెట్‌ లూలు గ్రూప్‌నకు అత్యంత కీలకమైంది. ఇక్కడి వ్యవస్థీకృత రిటైల్‌ రంగం కేవలం 12 శాతం మాత్రమే వినియోగంలో ఉంది. ఈ విభాగంలో భారీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాము’’ అని గ్రూప్‌ షాపింగ్‌ మాల్స్‌ డైరెక్టర్‌ శిబు ఫిలిప్స్‌ తెలిపారు.

చదవండి: Apple: యాపిల్‌ భారీ షాక్‌, ఉద్యోగులపై వేటు!

మరిన్ని వార్తలు