బడాబాబులు ఎక్కడా తగ్గట్లే: లంబోర్ఘిని కార్ల హాట్‌ సేల్‌

22 Feb, 2023 13:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ కార్-మేకర్ లంబోర్ఘిని  ఇండియాలో రికార్డ్‌ సేల్స్‌ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్లను విక్రయిస్తున్న సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇండియాలో తమ  టార్గెట్‌ రీచ్‌ అయిందని కంపెనీ  ప్రకటించింది.  2023లో భారతదేశంలో 100 కార్లను విక్రయించాలనేది అసలు ప్లాన్. అయితే, ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకుండానే  వీటిలో 90 కార్లను ఇప్పటికే ఆర్డర్స్‌ను  అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (UHNIలు) హాట్‌కేక్‌లా కొనుగోలు చేస్తున్నారని లంబోర్ఘిని  ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని  తెలిపారు.

లంబోర్ఘిని ఉరుస్ లగ్జరీ SUV, అవెంటడోర్, హురాకాన్ వంటి లగ్జరీ కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. భారతదేశంలో దాని అన్ని కార్ల ధరలు రూ. 4 కోట్లకు పైమాటే. అయినప్పటికీ, సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు  ఈ కార్లను ఎగరేసుకు పోవడం విశేషం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లంబోర్ఘిని మార్కెట్‌లలో ఇండియా ఒకటి. వార్షిక ప్రాతిపదికన 30 శాతం అమ్మకాలను సాధిస్తోంది.  2022లో దేశంలో 90 కార్లు విక్రయించగా, చైనాలో 1,000 కార్లను విక్రయించింది. 

మహమ్మారి అనంతర డిమాండ్ లంబోర్ఘిని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. గ్లోబల్ ట్రెండ్‌ల గురించి మాట్లాడుతూ 2023 ఏడాదికి సంబంధించిన  ఆర్డర్లు ముగిసాయి. 2024 ఆర్డర్లను  తీసుకుంటున్నాం. రోజువారీ ఆర్డర్‌బుక్  ఇంత  ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని స్కార్డొని   సంతోషం ప్రకటించారు. ఆర్డర్ బుకింగ్‌ సగటున 18 నెలల కంటే ఎక్కువే.

మరిన్ని వార్తలు