ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్‌

25 May, 2021 15:07 IST|Sakshi

ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి కొత్త కుబేరుడు వచ్చి చేరుడు. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడుగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ రెండవ స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 13 లక్షల 57వేల 737 కోట్ల పైనే.

బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. ఆ సంస్థ స్టాక్స్ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తులు జెఫ్ బిజోస్‌ను మించి పోయాయి. లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ద్వారా లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఆయా బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరగడంతో ఆర్నాల్ట్ ఆస్తులు వృధ్ధి చెందాయి. ప్రస్తుతం జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లు. మరోవైపు ప్రపంచం కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 147.3 బిలియన్ డాలర్లు. ఎల్ఎమ్ హెచ్ వి కంపెనీ 2021 మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోల రెవిన్యూ నమోదు చేసింది. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. 

చదవండి:
కోవిడ్‌-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు

మరిన్ని వార్తలు