Mahindra & Mahindra ఎం అండ్‌ ఎం దూకుడు: వచ్చే సెప్టెంబరులోనే

8 Jul, 2022 16:14 IST|Sakshi

బీఐఐతో   ఎం అండ్‌ ఎం  డీల్‌

కొత్త 4 వీల్‌  ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంటిటీ

సాక్షి, ముంబై: దేశీయ ఆటో మేజర్‌  మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్‌  ఎస్‌యూవీ సెక్టార్లో దూసుకుపోనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ ఈవీ ఎక్స్‌యూఏవీ 400ని ఆవిష్కరించ నున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ గురువారం అర్థరాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతలతో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని  లాంచ్‌ చేస్తామన్నారు. అంతేకాదు 2027 నాటికి  తమ ఎస్‌యూవీలలో 20 శాతం నుండి 30 శాతం వరకు ఎలక్ట్రిక్‌గా ఉండాలని భావిస్తున్నట్టు  తెలిపారు. 

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు మహీంద్రా భారీ కసరత్తే చేస్తోంది. 2022, ఆగస్ట్ 15 న జరిగే యూకే ఈవెంట్‌లో తమ విజన్‌ను ప్రకటిస్తామని ఆటో అండ్‌ అగ్రి విభాగానికి చెందిన రాజేష్ జెజురికర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా ఉన్న తాము భవిష్యత్తులో 4వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ మార్కెట్లో కూడా టాప్‌లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  సీఈవో అనిష్ షా తెలిపారు. 

తాజాగా ఎంఅండ్‌ఎం యూకే డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ (బీఐఐ) తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొత్త ఫోర్-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను తీసుకురానుంది. ఇందులో రూ. 1,925 కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సంస్థలో బీఐఐ వాటా 2.75 శాతంగా, ఎం అండ్‌ ఎం వాటా 4.76 శాతంగా ఉంటుంది.  తొలుత ఇరు కంపెనీలు రూ. 1,925 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తాయి. రెండు విడతలుగా, రూ. 70,070 కోట్ల విలువైన మూలధన సమకూర నుందని అంచనా. ఈ డీల్ ప్రకటించిన తర్వాత ఎంఅండ్‌ఎం షేర్లు ట్రేడింగ్‌ ఆరంభంలో ఆల్-టైమ్ హైని నమోదు చేశాయి.

మరిన్ని వార్తలు