Luxury Houses: ఆ ఇళ్లపై ఇదేం పిచ్చి..  ఎన్ని కోట్లయినా కొనేస్తున్నారు!

6 Mar, 2023 17:30 IST|Sakshi

విలాసవంతమైన ఇళ్లపై సంపన్నులకు మోజు తగ్గడం లేదు. ధర ఎన్ని కోట్లయినా కొనడానికి వెనకాడటం లేదు. అందుకే  అత్యంత విలాసవంతమైన రెసిడెన్సియల్‌ ప్రాజెక్ట్‌లను కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడి ఏర్పాటు చేస్తున్నాయి.

ఇవీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌! రూ.295 కట్‌ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. 
హారిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి!

గత నెలలో డీఎల్‌ఎఫ్‌ గురుగ్రామ్‌లో 72 గంటల్లో రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన 1,137 ఫ్లాట్లను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంగతి మరవకముందే గోద్రెజ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో రూ.24,575 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను అమ్మకానికి పెట్టింది. అది కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే.

గురుగ్రామ్‌లో డీఎల్‌ఎఫ్‌ లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు కోసం వచ్చిన జనం అంటూ ఫిబ్రవరిలో వైరల్‌గా మారిన ఫొటో ఇది 

గోద్రేజ్‌ సంస్థ ఢిల్లీలోని  ఓ ప్రముఖ హోటల్‌లో కొనుగోలుదారులను ఆహ్వానించి వారికి ప్రాజెక్ట్‌కు సంబంధించిన  త్రీడీ మోడల్‌ను, వీడియోలను ప్రదర్శించింది. అందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూపించింది. వీటిలో వేడినీటి కొలను (హాట్‌ పూల్‌) వంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు 160 ఎంపిక చేసిన కస్టమర్లను ఈ ఫ్లాట్లను సందర్శించేందుకు ఆహ్వానించగా ఎనిమిది అంతస్తుల ప్రాజెక్ట్‌లో 46 ఫ్లాట్లలో 17 అమ్ముడుపోయాయి.

తాము విలాసవంతమైన నివాసాలను మాత్రమే విక్రయించడం లేదని, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నామని గోద్రెజ్ సేల్స్ మేనేజర్ యువరాజ్ మంచందా పేర్కొన్నారు. తమ అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లను మిలియనీర్లు, బిలియనీర్లు కొనుగోలు చేస్తారని చెప్పారు. కాగా గురుగ్రామ్‌లో గతనెల అమ్ముడైన ఫ్లాట్లకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ ఇటీవలె పూర్తయింది.

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ యూజర్లకు బిగ్‌ న్యూస్‌: ఇక మరింత ఫాస్ట్‌గా ఇంటర్నెట్‌!

మరిన్ని వార్తలు