బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్‌!

10 Sep, 2021 17:09 IST|Sakshi

Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియన్‌ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్‌మెంట్‌ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది.

వయడక్టు నిర్మాణంలో
ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ టట్రైన్‌ పప్రాజెక్టును ఇండియన్‌ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్‌ రైలు ట్రాక్‌ నిర్మాణం జరుగుతోంది. నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన  వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్‌ క్యారియర్లు, గర్డర్‌ ట్రాన్స్‌పోర్టర్లు వంటి భారీ ఎక్విప్‌మెంట్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

మేడ్‌ ఇన్‌ ఇండియా
బుల్లెట్‌ రైలు ట్రాక్‌ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్‌మెంట్‌ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్‌ అంట్‌ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్‌ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రారంభించారు.

వాటి తర్వాత ఇండియానే
బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్‌ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్‌ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల​‍్లెట్‌ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

చదవండి: Infosys: ఈ కామర్స్‌ స్పెషల్‌.. ఈక్వినాక్స్‌ సొల్యూషన్స్‌

మరిన్ని వార్తలు