యాపిల్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌

10 Mar, 2021 17:05 IST|Sakshi

మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 త్వరలోనే

ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి కొనుగోలుకు అందుబాటులో

సాక్షి,న్యూఢిల్లీ:  యాపిల్‌ ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త. మరొకొద్ది రోజుల్లో మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రానుంది.  దేశీయంగా భారీ ఆదరణకు నోచుకున్న ఐఫోన్ 12 ఇప్పుడు భారతదేశంలో స్థానికంగా తయారవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని విశ్లేషకులు,  పరిశ్రమ వర్గాలు  ఘంటాపథంగా చెబుతున్నాయి.  దీంతో మేడిన్‌ ఇండియా ఐఫోన్‌12 తక్కువ  ధరకే  లభించనుందని భారతీయ ఐఫోన్‌ లవర్స్ భావిస్తున్నారు.

స్థానిక వినియోగదారుల కోసం భారత్‌లో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 12 మోడల్ ఫోన్ల తయారీని ప్రారంభించనుండటం చాలా గర్వంగా ఉందనీ కస్టమర్ల సంతోషం కోసం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైన ఉత్పత్తులు, సేవలు అందించేందుకు  కట్టుబడి ఉన్నామని కంపెనీ పేర్కొంది.  భారతదేశంలో ఐఫోన్ 12  స్థానికంగా రూపొందడంతో తమ  లాభాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నామని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ), సైబర్ మీడియా రీసెర్చ్ లిమిటెడ్. హెడ్‌  ప్రభు ప్రభు రామ్ చెప్పారు. 

అక్టోబర్ 2020 లో ప్రారంభించిన ఐఫోన్ 12 లో అధునాతన కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో పాటు సొగసైన ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, ప్రకాశవంతమైన వీక్షణ అనుభవం, కొత్త సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ , ఓఎల్‌ఈడీ తో విస్తారమైన ఎడ్జ్-టు-ఎడ్జ్ సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి.  దీని ధర . రూ .69,990 . ఐఫోన్ ఎస్‌ఇతో  సహా యాపిల్ 2017 లో భారతదేశంలో ఐఫోన్‌ల తయారీని  ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలుగా,  ఐఫోన్ ఎక్స్ ఆర్‌, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్‌ఈ 2020 తాజాగా  ఐఫోన్ 12 తో సహా కొన్ని అధునాతన ఐఫోన్‌లను తయారు చేస్తోంది. వీటిని పలు దేశాలుకుఎగుమతి కూడా చేస్తుంది. కాగా యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారు విస్ట్రాన్ కోలార్‌లోని తన నరసపుర  యూనిట్‌లో అన్ని అవసరమైన క్లియరెన్స్‌తో మార్చి 8, 2021 నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనాయి. బెంగుళూరు సమీపంలోని    విస్ట్రాన్ కంపెనీలో జీతాల చెల్లింపు ఆలస్యం కావడంతో ఉద్యోగుల ఆందోళన విధ్వంసానికి దారితీసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు