స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు దారులకు భారీ షాక్‌!

23 Aug, 2022 16:28 IST|Sakshi

స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారుల‌కు బ్యాడ్ న్యూస్‌. త్వ‌ర‌లో భార‌త్‌లో త‌యార‌య్యే స్మార్ట్ ఫోన్‌ల ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్ విభాగం మొబైల్స్‌లో వినియోగించే ఇన్ పుట్స్‌పై (ఫోన్‌లో వినియోగించే విడి భాగాలు) క‌స్ట‌మ్ డ్యూటీ ఛార్జీల‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్‌ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా త‌యార‌య్యే స్మార్ట్ ఫోన్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌నున్నాయి.   

పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ల డిస్‌ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్‌ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 

"సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్‌మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్‌లు (ఎఫ్‌పీసీ), ఇతర వస్తువులు డిస్‌ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది.

నో క్లారిటీ
చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్‌ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్‌ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్‌ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ అధికారులు ఫోన్‌ల విడి భాగాలపై విధించే కస్టమ్‌ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం.

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని వార్తలు