సేఫ్టీ క్రాష్‌ టెస్ట్‌లో స్విఫ్ట్‌, డస్టర్‌ ఫెయిల్‌!

29 Aug, 2021 10:42 IST|Sakshi

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్‌, రెనాల్ట్‌ డస్టర్‌ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్‌ ఎన్‌సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి.

క్రాష్‌ టెస్ట్‌
కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్‌ ఎస్సెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) పేరుతో క్రాష్‌ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్‌ ఇస్తుంటాయి.  ఇటీవల లాటిన్‌ ఎన్‌సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్‌, రెనాల్ట్‌ డస్టర్‌ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్‌ రేటింగ్‌ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి.

మారుతి స్విఫ్ట్‌ పరిస్థితి
మారుతి సిఫ్ట్‌కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్‌ ఆక్యుపెంట్‌ బాక్స్‌ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్‌ ఆక్యుపెంట్‌ బాక్స్‌ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్‌ ప్రొటెక‌్షన్‌, వల్నరబుల్‌ రోడ్‌ బాక్స్‌ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్‌ బాక్స్‌ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే  సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్‌ ఎన్‌సీఏపీ జీరో రేటింగ్‌ ఇచ్చింది.

డస్టర్‌దీ అదే దారి
రెనాల్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ డస్టర్‌కి ఈ క్రాష్‌ టెస్ట్‌లో ఆడల్డ్‌ ఆక్యుపెంట్‌ బాక్స్‌ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్‌ ఆక్యుపెంట్‌ బాక్స్‌ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్‌ ప్రొటెక‌్షన్‌, వల్నరబుల్‌ రోడ్‌ బాక్స్‌ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్‌ బాక్స్‌ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే  సాధించగలిగింది.
రక్షణ చర్యలేవి
లాటిన్‌ ఎన్‌సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్‌, రెనాల్ట్‌ డస్టర్ల్‌ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్‌ ఇంపాక్ట్‌ ప్రొటెక‌్షన్‌ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్‌ ఎన్‌సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ సిస్టమ్‌ లేకపోవడం పెద్దలోటని తెలిపింది.
ఇప్పుడే కష్టం
యూఎన్‌ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్‌ , డస్టర్‌ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్‌ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్‌ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్‌ రేటింగ్‌ వచ్చింది. ఈసారి రేటింగ్‌ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్‌, లాటిన్‌ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. 
 

చదవండి : హ్యుందాయ్‌ సంచలనం! త్వరలో హైడ్రోజన్‌ వేవ్‌ కారు!!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు