యూట్యూబ్, గూగుల్‌కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్‌లు ఎలా వస్తున్నాయ్‌!

14 Oct, 2022 21:48 IST|Sakshi

నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్‌ తదితర గేమ్‌లు మళ్లీ ఆన్‌లైన్‌లోకి ఎలా వస్తున్నాయ్‌.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై దాఖలైన పిటిషన్‌ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు.

ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్‌లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్‌ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్‌ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు