Maggi: మ్యాగీ లవర్స్‌కు భారీ షాక్‌!

22 Apr, 2022 18:35 IST|Sakshi

రెండు నిమిషాల్లోనే రెడీ. అంటూ మ్యాగీ నూడిల్స్‌తో మధ్యతరగతి జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది నెస్లే ఇండియా లిమిటెడ్‌. ఇప్పుడీ ఈ మ్యాగీ  పెరుగుతున్న ధరలతో మసాలా దట్టించకముందే నషాళాలనికి అంటుతుంది. ఈ ఏడాది మార్చిలో నెస్లే సంస్థ మ్యాగీ నూడిల్స్‌ ధరల్ని పెంచింది. ఇప్పుడు మరోసారి ధరల్ని పెంచుతున్నట్లు తెలిపింది.  

మ్యాగీ ఈ పేరు తెలియని పిల్లలుండరు. రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్‌ను వండి వార్చితే. లొట్టలేసుకొని లాగించేస్తుంటారు పిల్లలు. బ్రేక్‌ ఫాస్ట్‌ నుంచి ఈవినింగ్‌ స్నాక్స్‌ వరకు ఎప్పుడైనా సరే మ్యాగీ ఉంటే చాలు. పిల్లలే కాదు..పెద్దలు సైతం మసాలా నూడిల్స్‌ను ఇష్టంగా తింటుంటారు. అలాంటి నూడిల్స్‌..పెరుగుతున్న ధరల కారణంగా తినేందుకు మరింత భారంగా మారనున్నాయి.

 

నెస్లే సంస్థ మార్చిలో మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచింది. ఇప్పుడు ఆ ధరల్ని మరింత పెంచనున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది.  మ్యాగీతో పాటు నెస్లే తయారు చేస‍్తున్న కిట్‌ కాట్‌, నెస్‌కెఫే కాఫీ ధరలు పెరగనున్నట్లు నెస్లే సీఈఓ ష్నీడర్‌ చెప్పారంటూ ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. 

మ్యాగీ ధరలు పెరగడానికి కారణం ఇదే 
ముడి సరుకు,ఫ్యూయల్‌, ట్రాన్స్‌ పోర్ట్‌, వర్క్‌ర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరిగడం వల్లే వరుసగా మ్యాగీ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నెస్లే సీఈఓ ష్నీడర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెస్లే..ఉత్పత్తిని పెంచడం,అంతర్గతంగా అమ్మకాల వృద్ధిని' చూసింది. పెరుగుతున్న ఇతర (పైన పేర్కొన్నట్లు) ఖర్చుల కారణంగా ఉత్పత్తుల ధరల్ని పెంచడం అనివార్యమైంది. ఇక ఈ సంవత్సరం అమ్మకాలు,లాభాల లక్ష్యాలను చేరుకోగలదని నెస్లే స్పష్టం చేసింది.

చదవండి👉 పిడుగులాంటి వార్త..సామాన్యులకు షాక్.. వీటి ధరలు భారీగా పెరిగాయ్‌!

మరిన్ని వార్తలు