పిడుగులాంటి వార్త..సామాన్యులకు షాక్.. వీటి ధరలు భారీగా పెరిగాయ్‌!

14 Mar, 2022 17:25 IST|Sakshi

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్‌), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి

నేషనల్‌ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్‌,కాఫీ ఫౌడర్‌ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్‌ రూ.12 నుంచి రూ.14 పెరిగింది.

140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్‌ 12.5శాతంతో  ధర రూ.3 పెరిగింది. 

560 గ్రాముల ప్యాకెట్‌ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది.    

నెస్లే ఏప్లస్‌ ఒకలీటర్‌ కార్టన్‌ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. 

నెస్‌కెఫె క్లాసిక్‌ కాఫీ ఫౌడర్‌ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది.

నెస్‌కెఫె క్లాసిక్‌ 25 గ్రాముల ప్యాకెట్‌ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. 

నెస్‌ కెఫె క్లాసిక్‌ 50 గ్రాముల ప్యాకెట్‌ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది.   

హెచ్‌యూఎల్‌ సైతం టీ, కాఫీ ఫౌడర్‌ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్‌ మహల్‌ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. 

♦ బ్రూక్‌ బ్రాండ్‌ 3 రోజెస్‌ వేరియంట్‌ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత‍్తులపై పడనున్నాయి.  

చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!

మరిన్ని వార్తలు