వ్యాపారవేత్తకు భారీ షాక్‌: రూ. కోటి ఖాళీ, ఏం జరిగిందంటే?

10 Nov, 2022 14:58 IST|Sakshi

సాక్షి, ముంబై: సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు హద్దే లేకుండా రోజురోజుకు మితిమీరుతున్నాయి.  టెక్నాలజీ తెలియని అమాయక ప్రజలనే మాత్రమే కాదు, వ్యాపారవేత్తలను టార్గెట్‌ చేస్తూ కోట్లను దోచేస్తున్నారు. తాజాగా ఒక వ్యాపారవత్త మొబైల్‌ ఫోన్‌  హ్యాక్‌ చేసి కోటి రూపాయలను మాయం చేసిన ఘటన కలకలం రేపింది.

మహారాష్ట్రలోని థానే నగరంలో వ్యాపారవేత్త ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మొబైల్ ఫోన్‌ను హ్యాకింగ్‌ గురైందనీ, ఆ తరువాత రూ. 99.50 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఈ నెల 6-7 తేదీల మధ్య  వ్యాపారవేత్త ఫోన్‌ హ్యాక్‌ చేసి మరీ, బ్యాంకు ఖాతాలోని సొమ్మును నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు తరలించారని వాగ్లే ఎస్టేట్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు