మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ‘కిస్బీ’ కమింగ్‌ సూన్‌

26 Oct, 2022 13:20 IST|Sakshi

సాక్షి, ముంబై:  మహీంద్రా  అండ్‌ మహీంద్రా ఎలక్ట్రిక్  బైక్‌ లవర్స్‌ను  ఆకర్షించేలా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ ‘ప్యుగోట్ కిస్బీ’ ని త్వరలోనే  దేశీయంగా ఆవిష్కరించనుంది.  

వచ్చే ఏడాది ఆరంభంలో  ఇది మార్కెట్లను పలకరించే అవకాశం అంచనా.  కిస్బీ ధర రూ. 1 లక్షగా ఉంటుందని భావిస్తున్నారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న మహీంద్ర ఈ-స్కూటర్‌ కిస్బీ...ఎథర్ 450ఎక్స్, ఓలా ఎస్1, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

1.6 కేడబ్ల్యూహెచ్ 48వీ సామర్థ్యం గల లిథియం అయాన్ రిమూవబుల్‌ బ్యాటరీతో వస్తున్న కిస్బీ గంటలకు 45 కి.మీ. గరిష్ట వేగంతో 42 కి.మీ. మైలేజే ఇవ్వనుందిట.   లాంచింగ్‌ ముందు ఇండియాలో ప్రత్యేకంగా  తీసుకురానున్న  కిస్బీ మోడల్ ఈవీ టెస్ట్ రన్‌  కూడా నిర్వహించింది. 

కిస్బీ ఎలక్ట్రిక్ స్కూటర్  ఫీచర్లు
ఏథర్ 450ఎక్స్‌ ఈవీ తరహాలో హైటెక్ ఫీచర్లను జోడించినట్టు తెలుస్తోందికలిగి ఉంది. స్కూటర్‌లో ట్యూబులర్ స్టీల్ చట్రం,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్‌ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్స్ కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు