మహీంద్రా ఎక్స్‌యూవీ400 టార్గెట్‌ 20,000 యూనిట్లు!

17 Jan, 2023 08:23 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్‌లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్‌ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్‌ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్‌ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది.

34.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్‌ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో రూపొందిన ఈఎల్‌ ట్రిమ్‌ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్‌లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్‌ ధరలో విక్రయిస్తారు.

చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు!   

మరిన్ని వార్తలు